Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
APలో దంచికొడుతున్న వర్షాలు: నేడు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు!
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, వర్షాలు మాత్రం జోరుగా కురుస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల ప్రభావం ఉండటంతో అధికార యంత్రాంగం ముందస్తు రక్షణ చర్యలను మరింత వేగవంతం చేసింది.ముఖ్యంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అధికారులు నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అన్ని రిజర్వాయర్లు, చెరువులను నీటితో నింపాలని మరియు అవసరమైన ప్రాంతాల్లో మొబైల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.



